ఘనంగా నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
NRPT: మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో ఇవాళ వడ్ల అనురాధ నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు రిబ్బన్ కటింగ్ చేసి, గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. మంత్రి సహకారంతో ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బీసం చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.