విద్యుత్ షాక్‌తో రైతు మృతి
BHNG: మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఉదయం పొలం దగ్గరికి వరి పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మోటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు రైతు దొండ కొమురయ్య (58) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా అప్పటికే రైతు మరణించినట్లుగా స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.