'సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడోద్దు'
VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో తెట్టంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చీపురుపల్లి సీఐ శంకరరావు, గుర్ల ఎస్సై పి.నారాయణరావు విద్యార్థులకు చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడోద్దని విద్యార్థులకు సూచించారు. అలాగే పాఠశాలలో స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు వివరించారు.