పీలేరులో ప్రభుత్వ భూముల వివాదం

పీలేరులో ప్రభుత్వ భూముల వివాదం

అన్నమయ్య: గూడరేవుపల్లి గ్రామానికి చెందిన బాధితులు ఎమ్మెల్యే కిషోర్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ నాయకుల మాటలు నమ్మి సర్వే నంబర్ 757/2, 757/3లోని ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి మోసపోయామని తెలిపారు. 120 మందిలో 60 మంది ఇళ్లు నిర్మించగా, ఇటీవల రెవెన్యూ అధికారులు కొన్ని నిర్మాణాలు కూల్చివేశారు. ఈ విషయంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.