ప్రతి నీటి చుక్కను సంరక్షించాలి: కలెక్టర్

ప్రతి నీటి చుక్కను సంరక్షించాలి: కలెక్టర్

SS: పుట్టపర్తి సాయి ఆరామంలో నిర్వహించిన 'జలధార-జలహారతి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. భూమాతను కాపాడుకోవాలంటే నీటి సంరక్షణ తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. రైతులు ఇంకుడు గుంతలు, చెరువుల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. 100రోజుల జలధార కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నీటి సంరక్షణ పనులు తక్షణమే చేపడతామని వెల్లడించారు.