'అంచలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి'

'అంచలంచెలుగా  ఉన్నత శిఖరాలను అధిరోహించాలి'

NTR: నందిగామ పట్టణంలోని కె.వి.ఆర్. కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతి యువకులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని అన్నారు. ఉపాధి ఎంత చిన్నదైనా అది యువతి యువకులు సద్వినియోగం చేసుకొని అంచలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.