బడ్జెట్ పత్రాల దగ్ధం.. న్యూడెమోక్రసీ నాయకులు నిరసన

బడ్జెట్ పత్రాల దగ్ధం.. న్యూడెమోక్రసీ నాయకులు నిరసన

SRPT: కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్లకు వరంగా, పేదలకు శాపంగా ఉందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌ కుమార్‌ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెలంగాణకు విభజన హామీల అమలులో మొండిచేయి చూపారని, నిరుద్యోగులను వంచించారని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌ను వెంటనే సవరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.