'త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం'

'త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం'

NLR: జిల్లాలో త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని ఉదయగిరి ఇంఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి పి.చెన్నారెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొట్టాలపల్లి సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామని తెలిపారు. త్వరలో తేదీ ప్రకటించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.