కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి గెలుపుకు కృషి చేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. సోమవారం గోదావరిఖనిలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ తోనే సుస్థిరపాలన సాధ్యమని అన్నారు.