VIRAL VIDEO: దేశభక్తికి నిజమైన నిదర్శనం!
పాఠశాల నుంచి విద్యార్థులు ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. స్కూల్ పూర్తైన తర్వాత పిల్లలంతా ఇంటికి వెళ్తుండగా.. ఒక్కసారిగా జాతీయ గీతం వినిపించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే నిల్చొని జాతీయ గీతాన్ని ఆలపించారు. టీచర్లతో పాటు చిన్న పిల్లలు సైతం అక్కడే ఆగారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ తరం పిల్లల్లో దేశభక్తిని చూసి ప్రశంసిస్తున్నారు.