మహిళా సర్పంచ్ ఎన్నికల సన్నాహ సమావేశం: ఎమ్మెల్యే
WGL: నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ మహిళా సర్పంచ్‌ల ఎన్నిక సన్నాహ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డివిజన్లో మహిళా రిజర్వేషన్ స్థానాలలో మహిళ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.