విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
GDWL: ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ వసతిగృహంలో విద్యార్థులకు జరిగిన ఫుడ్ పాయిజన్ నేపథ్యంలో శనివారం కలెక్టర్ సంతోష్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన కారణాలను వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సరిపడా మెరుగైన వైద్యం అందించాలన్నారు.