'రాజీవ్ వికాసంలో సిబిల్ స్కోర్ తప్పనిసరి చేయడం దారుణం'

SDPT: బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఉమేష్ అధ్యక్షతన సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల మల్లేశం ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ వికాసం స్కీంలో సిబిల్ తప్పనిసరి చేయడం చాలా దారుణమన్నారు.