VIDEO: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం: గిద్దలూరులోని నల్లబండ బజారులో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమంగా తరలిస్తున్న రమణారెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరం అని అన్నారు.