రామాపురం PSని ఆకస్మికంగా పరిశీలించిన ఎస్పీ
అన్నమయ్య జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇందులో భాగంగా సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు స్మార్ట్ పోలీసింగ్ ద్వారా టెక్నాలజీ వినియోగం పెంచాలని సూచించారు. మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.