మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
NRPT: పని ప్రదేశాల్లో వేదింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు సూచించారు. నారాయణపేటలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూపర్ మార్కెట్, ఆసుపత్రి తదితర చోట్ల పనిచేస్తున్న మహిళలకు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు నియమాలపై వివరించారు. వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.