ఉప్పొంగిన వేదావతి.. రాకపోకలకు అంతరాయం

KRNL: హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో వేదావతి నది ఉప్పొంగడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగి, ప్రజలు నదిని దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నదిపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.