స్థలం విషయంలో ఘర్షణ పడ్డవారిపై కేసు నమోదు

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో ఆదివారం నాడు స్థలం విషయంలో నారా బోయిన మధు, మల్లికార్జున, సంజన్న ఘర్షణ పడ్డారు. నారా బోయిన మధుపై మల్లికార్జున, సంజన్న కలిసి రాయితో దాడి చేశారు. మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు తెలిపారు.