మండలంలో భారీ వర్షం
KNR: సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి, సోమారం, లస్మన్నపల్లి, ఎక్లాస్‌పూర్ తదితర గ్రామాల్లో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుపాన్‌తో ఇప్పటికే నష్టపోయిన రైతులు, వర్షం కొనసాగితే పంటలు నీటి పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.