పరిహారం కాదు పరివర్తన రావాలి: మాజీ ఎమ్మెల్యే

పరిహారం కాదు పరివర్తన రావాలి: మాజీ ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లిలో జరిగిన దళిత యువకుడు రాజశేఖర్ హత్య సభ్య సమాజానికి సిగ్గుచేటుగా మారిందని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని కుల, మత, ఆర్థిక అంతరాలు నశించాలన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం కాదు, సమాజంలో పరివర్తన వచ్చే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉదృతం చేయాలన్నారు.