ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌కు 311 వినతులు

ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌కు 311 వినతులు

కోనసీమ: ప్రజా దర్బార్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుని, సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన మండల అధికారులతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి 311 వినతులు అందాయని తెలిపారు.