వెల్దుర్తి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

వెల్దుర్తి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

KRNL: వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎం. నరేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న అశోక్ గూడూరుకు బదిలీ అయ్యారు. జిల్లాలో తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని ఆయన స్పష్టం చేశారు.