బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

SS: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తికి వచ్చిన ఆయన, సాయి కుల్వంత్ హాల్‌లో బాబా మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు గోయల్‌కు స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందించారు.