విద్యార్థులను సన్మానించిన కలెక్టర్

విద్యార్థులను సన్మానించిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ హరిత బుధవారం సన్మానించారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కృషి, క్రమశిక్షణ ఉంటే విజయం తప్పక సొంతమవుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.