తుని ఎస్సైగా పాపారావు బాధ్యతలు

KKD: తుని పట్టణ PSకు మరో SIని నియమించినట్లు సీఐ గీతారామకృష్ణ తెలిపారు. ఇప్పటికే ఎస్సై విజయ్ బాబు విధులు నిర్వహిస్తుండగా తాజాగా ఎస్సై పాపారావు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు విజయవాడలో ఎస్సైగా సేవలందించిన ఆయన బదిలీపై తునికి వచ్చారు. తునిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎస్సై తెలిపారు.