మురళీ మోహన్‌ను కలిసిన ఎమ్మెల్యే పల్లె సింధూర

మురళీ మోహన్‌ను కలిసిన ఎమ్మెల్యే పల్లె సింధూర

సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ పుట్టపర్తిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయనను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాబా శత జయంతి ఉత్సవాల ఏర్పాట్ల గురించి వారంతా చర్చించారు.