నకిలీ వైద్యుల ఆపరేషన్.. యువకుడు ప్రాణాపాయ స్థితి
WGL: పర్వతగిరి మండలం నెక్కొండకు చెందిన రజినీకాంత్ (20) అర్షమొలల చికిత్స, పేరుతో మంగళవారిపేటలోని నకిలీ వైద్యుల కౌసల్య, ఆర్ఎంపీ చిట్టిబాబు చేతిలో మోసపోయాడు. ఈ నెల 13న వారు చేసిన ఆపరేషన్ విఫలమై తీవ్ర రక్తస్రావం జరిగింది. హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.