తిన్నెలపూడిలో నేడు ఎమ్మెల్యే పర్యటన
TPT: కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలో ఇవాళ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటించనున్నారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని మండల టీడీపీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని పార్టీ నేతలు కొనియాడారు.