ప్రేమ పెళ్లికి నిరాకరించారని యువతి ఆత్మహత్య

ప్రేమ పెళ్లికి నిరాకరించారని యువతి ఆత్మహత్య

KMR: ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం బిక్కనూర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానస (21) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.