కరెంట్ పోల్ నుండి తెగపడ్డ తీగ.. తప్పిన పెను ప్రమాదం

కరెంట్ పోల్ నుండి తెగపడ్డ తీగ.. తప్పిన పెను ప్రమాదం

ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ పట్టణంలో స్థానిక చిక్కనేశ్వర స్వామి ఆలయం సమీపాన విద్యుత్ పోల్ నుండి ఒక్కసారిగా కరెంట్ తీగ కింద పడింది. అక్కడే ఆ సమయంలో ఉన్న రిపోర్టర్ కరెంట్ కార్యాలయానికి కాల్ చేసి సమాచారం చేరవేసి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించాడు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపించుకున్నారు. స్థానికులు ఆ రిపోర్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు.