మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్డు కీలక తీర్పు
HYD: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ నెల 4వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం యధావిధిగా నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 4వ తేదీన కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ నాయకులను ఎన్నుకోనున్నారు.