'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

నిర్మల్ జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లపై శనివారం నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి, తదితరులు పాల్గొన్నారు.