నేడు ఉపసర్పంచ్ ఎన్నికలు

నేడు ఉపసర్పంచ్ ఎన్నికలు

జనగామ జిల్లాలో సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవమైన గ్రామాల్లో ఇవాళ ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. సంబంధిత అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.