VIDEO: వేప చెట్టుకు 'కల్లు'.. పోటెత్తిన జనం..!
SRPT: కలియుగంలో వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే.. మెల్లచెరువు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వెనుక ఉన్న వేప చెట్టు నుంచి కల్లు కారుతోంది. ఈ విషయం దావాగ్నిలా వ్యాపించడంతో భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొందరు దీనిని దైవ లీలగా భావిస్తుండగా, మరికొందరు ప్రకృతి వింతగా చర్చించుకుంటున్నారు.