జార్ఖండ్ సీఎంను ఆహ్వానించిన Dy. CM భట్టి
TG: భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌లో ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్'కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన 'గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను' సీఎం సోరెన్‌కు భట్టి విక్రమార్క అందజేశారు.