VIDEO: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
NZB: ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకున్నామని సీపీ సాయి చైతన్య ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 40 కిలోల కాపర్ కాయిల్స్, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గత సంవత్సర కాలం నుండి జిల్లాలోని పలు మండలాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగలించారని వెల్లడించారు.