జనగణన ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: డీఆర్ఓ
ATP: జిల్లాలో చేపట్టనున్న 2027 జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల సూచించారు. ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా తరగతుల ముగింపులో ఆయన మాట్లాడారు. మొదటి దశలో ఇండ్ల జాబితా, గణన పక్కాగా నిర్వహించాలని, ప్రజల నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు.