‘గతంలో రాళ్లు.. నేడు పెన్నులు’
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ సరికొత్తగా మారిందని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ పేర్కొన్నారు. శ్రీనగర్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. గతంలో చిన్నారులు రాళ్లు విసిరేవారని, కానీ నేడు వారి చేతుల్లో పెన్నులు కనిపిస్తున్నాయని కొనియాడారు. లోయలో శాంతి నెలకొందని, అభివృద్ధి బాటలో 'నయా కాశ్మీర్' దూసుకుపోతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.