'లాటరీల పేరుతో ఆర్థిక మోసాలు చేస్తే కఠిన చర్యలు'
SRPT: జిల్లాలో స్థిరాస్తి లాటరీల పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఇవాళ తెలిపారు. “1000 కట్టు– ఫ్లాట్‌పట్టు” వంటి మోసపూరిత పథకాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. లాటరీల రూపంలో భూములు, ఫ్లాట్లు అమ్మడం చట్టవిరుద్ధమన్నారు.