VIDEO: 'ప్రజలందరూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి'
NLR: దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదివారం సూచించారు. కందుకూరు టౌన్‌లోని బాయ్స్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.