'ప్రకృతి వ్యవసాయం ఎంతో అవసరం'
ELR: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం రానున్న కాలంలో ఎంతో అవసరమైందని ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష చెప్పారు. కొత్తగా ఎంపికైన T-ICRPSకు 5 రోజులపాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా వ్యవసాయ కార్యాలయం పరిధిలో ప్రారంభించారు. ఇకపై రసాయన ఎరువులు లేకుండానే మనం ప్రకృతి ఆధారిత పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు.