రైలు పట్టాలపై యువకుడి మృతదేహం లభ్యం
TPT: చంద్రగిరి (M)లో నర్సింగాపురం వద్ద రైలు పట్టాలపై నిన్న షేక్ అస్లాం (20) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. సుండుపల్లికి చెందిన అస్లాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, చిత్తూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు.