మహానందిలో నంద్యాల న్యాయమూర్తి పూజలు

NDL: నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని గురువారం మహానందిలో పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన న్యాయమూర్తికి ఆలయం సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.