రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు

రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు

GDWL: ఎర్రవల్లి సమీపంలో మంగళవారం ఉదయం రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో, రాజస్థాన్‌కు చెందిన షాహిర్ ఖాన్ (32) కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.