'కవులు, రచయితలు రచనల ద్వారా దిశా నిర్దేశం చేయాలి'

'కవులు, రచయితలు రచనల ద్వారా  దిశా నిర్దేశం చేయాలి'

SRCL: రచయితలు, కవులు సమాజం కంటే ముందుండి తమ రచనల ద్వారా దిశా నిర్దేశం చేయాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రచయితలకంటే సమాజం ముందుకు వెళ్తుందని అందులోని ఘర్షణలను రచయితలు అందుకోవాలన్నారు. నిరంతరం అధ్యయనం చేయాలన్నారు.