మూడు మండలాల్లో బ్యూటిఫుల్ మూన్

కృష్ణా: బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాలలో ఆకాశం తన అందాలతో మంగళవారం రాత్రి మాయ చేసింది. నింగిలో మెరిసిన నిండు చంద్రుడు ప్రజల చూపులను కట్టిపడేశాడు. వెండి వెలుగులు విరజిమ్ముతూ ప్రకృతి తన మహిమను ఆవిష్కరించింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఆ వెన్నెల విందు చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చిత్రాల్లాంటి దృశ్యాలను కెమెరాలో బంధించారు.