బవుమా.. ఓటమి ఎరుగని సారథి

బవుమా.. ఓటమి ఎరుగని సారథి

సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిపిన టెంబా బవుమా ఈ ఫార్మాట్‌లో ఓటమి ఎరుగని సారథిగా కొనసాగుతున్నాడు. తాను సారథ్యం వహించిన 11 మ్యాచుల్లో ప్రోటీస్‌కు 10 విజయాలు అందించాడు. ఓ మ్యాచ్ డ్రా అయింది. అటు ప్లేయర్‌గానూ రాణిస్తున్నాడు. ఈ 11 మ్యాచుల్లో బవుమా 57 యావరేజ్‌తో 969 రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.