ధర్మోజి గూడెంలో ఉచిత వైద్య శిబిరం

ధర్మోజి గూడెంలో ఉచిత వైద్య శిబిరం

BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో వివేరా హాస్పిటల్ సౌజన్యంతో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ప్రారంభించి మాట్లాడుతూ.. పేదలకు ఇలాంటి శిబిరాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు నెలకు ఒకసారి గ్రామాల్లో వీటిని నిర్వహించాలని కోరారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.