చిన్నారిని రక్షించిన యువకుడిని అభినందించిన సీపీ

చిన్నారిని రక్షించిన యువకుడిని అభినందించిన సీపీ

HYD: ఆపదలో ఉన్న చిన్నారిని తన సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. బషీర్ బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఫిరోజ్‌ను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.