8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: హోంమంత్రి

8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: హోంమంత్రి

కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.